Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిర్మాత బండ్ల గణేష్ ఆస్తి వేలంపై హైకోర్టు సంచలన తీర్పు.!
posted on: Jul 4, 2026 9:18AM
.webp)
టాలీవుడ్ సినీ నిర్మాత, బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన రికవరీ ప్రక్రియ, వేలం చర్యలు పూర్తిగా చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఈ వేలాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
వివరాలిలా ఉన్నాయి.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు. అంతేకాకుండా, ఈ రుణాలకు సంబంధించి బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు వ్యక్తిగత హామీదారులుగా సంతకాలు చేశారు.
అయితే.. సదరు సంస్థ తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించలేదు. బకాయిలు పేరుకుపోవడంతో రంగంలోకి దిగిన యూనియన్ బ్యాంక్ అధికారులు, బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం రుణాల రికవరీలో భాగంగా 2019లో సర్ఫేసీ చట్టం కింద ఆ జూబ్లీహిల్స్ఆ ఆస్తిని బ్యాంక్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత బకాయిల వసూలు కోసం 2022లో ఆ 500 గజాల విలువైన ఆస్తికి బహిరంగ వేలం నిర్వహించారు.
ఆ వేలంలో ఆ ఆస్తి 8.51 కోట్ల రూపాయలు పలికింది. అయితే ఈ వేలాన్ని సవాల్ చేస్తూ.. బండ్ల గణేష్ వర్గం డెట్ రికవరీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. గతంలో డీఆర్‌టీ ఆ వేలాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో తమకు రావలసిన రికవరీ మొత్తం ఆగిపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. బ్యాంక్ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకభవించి, రుణాలు ఎగ్గొట్టినప్పుడు రికవరీ చేసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుందని స్పష్టం చేస్తూ, డీఆర్‌టీ ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Union Bank of India, Property Auction, Jubilee Hills Property, Bandla Ganesh Court Case






