Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు
posted on: Feb 3, 2026 7:56PM

నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీశ్‌లపై తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు వర్సిటీలో ఫీజుల పెంపుపై ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను యూనివర్సిటీ సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి కలెక్టరేట్‌కు వెళ్లేందుకు విద్యార్థి నేతలు అక్బర్, వినోద్ ప్రయత్నం చేశారు. అయితే మార్గంమధ్యలో ఇద్దరూ కూడా కిడ్నాప్‌నకు గురయ్యారు.
విద్యార్థులను కిడ్నాప్ చేసిన ఘటన నేపథ్యంలో మోహన్‌బాబు యూనివర్సిటీని వెంటనే బ్లాక్‌లిస్ట్ చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని వారు కోరారు. అలాగే, యూనివర్సిటీ విద్యార్థులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు ఇచ్చి జరిమానా విధించినప్పటికీ మోహన్‌బాబు యూనివర్సిటీలో ఎలాంటి మార్పు రాలేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.



.webp)


