హీమ్యాన్ ఆఫ్ బాలీవుడ్ ధర్మేంద్ర మృతి అంటూ వదంతులు
posted on Nov 11, 2025 8:23AM
.webp)
బాలీవుడ్ దిగ్గజ నటుడు, సీనియర్ హీరో ధర్మేంద్ర మంగళవారం (నవంబర్ 11) ఉదయం తుదిశ్వాస విడిచారంటూ వదంతులు వ్యాపించాయి.. ఆయన వయస్సు 89 ఏళ్లు. ఇటీవల ఆయన శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన ధర్మేంద్ర అప్పటి నుంచీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి ఈ ఉదయం తుది శ్వాస విడిచారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వాటిని ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ ఖండించారు. తన తండ్రి ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు..
హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావమంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరు తెచ్చుకున్నారు. 1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్‌లో షోలే , చుప్కే చుప్కే , ధర్మ్ వీర్ , సీతా ఔర్ గీత , యాదోం కి బారాత్ వంటి ఎన్నో సినిమాలలో తన అసమాన నటనతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభిమానులు ధర్మేంద్రను హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని పిలుచుకుంటారు. ప్రముఖ హీరోయిన్, బీజేపీ నాయకురాలు హేమమాలిని ఆయన భార్య.