Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హెర్ముజ్ మళ్లీ మూసివేత!
posted on: Apr 20, 2026 3:29PM

హెర్మూజ్ మళ్లీ మూతపడింది. అసలు ఏం జరుగుతోంది.. తర్వాత దారి ఎటు?.. పర్షియన్ గల్ఫ్ లో చిన్న నీటి మార్గం హోర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ రాజకీయాల, ఆర్థిక వ్యవస్థల నాడిని పట్టుకుంది. ఇరాన్ అమెరికా వార్ 50 రోజులు దాటడం, హెర్మూజ్ జల సంధి మళ్లీ మూతపడటమే.. ఈ సంక్షోభం ఎంత లోతుగా వెళ్లిందో చెబుతోంది. ఇది కేవలం ఒక సముద్ర మార్గం మూసివేత కాదు, ఇరాన్, అమెరికా, పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న దీర్ఘకాలిక శక్తి పోరాటంలో కొత్త మలుపు.
హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం? అంటే.. ఈ జలసంధి ప్రపంచ ఎనర్జీకి నాడి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20శాతం వరకు, ఈ సన్నని జలసంధి గుండా మాత్రమే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. దీని భౌగోళిక స్థానం చూస్తే.. ఒక వైపు ఇరాన్, మరో వైపు యూఏపీ. ఇది గల్ఫ్ నుంచి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రానికి వెళ్లే ఏకైక సముద్ర ద్వారం. అందుకే.. హోర్ముజ్ మూసివేత అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా బందీగా పెట్టగలదు అని చూపించే అత్యంత శక్తివంతమైన లీవర్.
యుద్ధం ప్రారంభమైన తరువాత ఇది రెండో మూసివేత.. ఈసారి ఎందుకంటే? కొందరి వ్యాఖ్యల ప్రకారం, అమెరికా పెద్ద స్థాయి దాడికి సిద్ధమవుతోందని రష్యా ఇరాన్ ను ముందుగానే హెచ్చరించిందనీ, దానికి ప్రతిగా ఇరాన్ హోర్ముజ్ ను మళ్లీ మూసివేసిందని పరిశీలకుల విశ్లేషణ. అంటే ఇది ఇరాన్ రక్షణాత్మక దాడి. మీరు మాపై దాడి చేస్తే, మేము మీ ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తాం అంటూ ఇరాన్ విస్పష్టంగా అమెరికాకు ఇచ్చిన సందేశం.
నెగోషియేషన్ టాక్టిక్.. అంటే హోర్ముజ్ మూసివేతను కేవలం సైనిక చర్యగా కాకుండా.. నెగోషియేషన్ టేబుల్పై పెట్టిన పెద్ద బేరసారపు చిప్ గా పరిశీలకులు చెబుతున్నారు. మీరు మా భూభాగాన్ని బాంబ్ చేస్తే, మేము మీ ట్యాంకర్లను నిలిపేస్తాం అని ఇరాన్ ఇచ్చిన స్పష్టమైన సందేశం. ఇరాన్ పై సైనిక చర్య విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ లెక్క తప్పిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇక ఈ విషయంలో బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది సెంచరీ, ఓపెన్ ఎండెడ్ ఇరానీ హాట్ వాటర్ కాడ్రన్ వంటి పదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇవే ఈ సంక్షోభం అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక తప్పిదమని చెప్పకనే చెబుతున్నాయి.
రెజీమ్ చేంజ్ vs రియాలిటీ
వేగంగా ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచి, అణు కార్యక్రమాన్ని ఆపేసి, ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఆరంభమైన దాడులు.. బూమరాంగ్ అయ్యాయి. ఇరాన్ ను హెర్మూజ్ కార్డ్ దూకుడుగా ఉపయోగించే స్థితికి తీసుకువెళ్లాయి. హెర్మూజ్ మూసి వేత ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీని వల్ల చమురు ధరలు ఎగసిపడటం, ఇన్ఫ్లేషన్, షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంల హెచ్చు అనివార్యమయ్యాయి. ఇది పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలపై మోయలేని భాగంగా పరిణమించింది.
ఈ పరిస్థితి చైనా, రష్యా వంటి దేశాలకు అందివచ్చిన అవకాశంగా మారింది.
హెర్మూజ్ సంక్షోభం, అమెరికా బ్లాకేడ్ పై ఇరాన్ స్పందన కలిసి చైనా, ఇరాన్ ఎనర్జీ అక్షాన్ని మరింత బలపరచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ కోణంలో చూస్తే, ఇరాన్ ను మూలకు నెట్టాలని చేసిన ప్రయత్నం.. ప్రపంచ మార్కెట్లను కుదేలు చేసే ప్రమాదంగా పరిణమించింది.
మార్కెట్లు, ఇన్వెస్టర్లు: క్యాష్ రెడీగా పెట్టుకోండి అన్న సందేశం.. రెండు విషయాలను సూచిస్తోంది. వోలాటిలిటీ అవకాశం, హెర్మూజ్ మూసి వేత, చమురు ధరల పెరుగుదల, తాత్కాలిక ఒప్పందం, హర్మూజ్ జలసంధి ఓపెన్ ప్రకటన ఇవన్నీ మార్కెట్లలో పెద్ద స్వింగ్ కు దారి తీశాయి. ఇలాంటి సమయంలో.. క్యాష్ ఉన్న ఇన్వెస్టర్ కి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇక రెండోది.. జియోపాలిటిక్స్–ఫైనాన్స్ను నేరుగా కలపడం. ఒక సముద్ర మార్గం మూసివేత, ఒక ట్వీట్ లేదా ప్రకటన, వెంటనే చమురు, ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో ప్రభావం. ఇది ఆధునిక ప్రపంచంలో యుద్ధం, డిప్లమసీ, మార్కెట్లు మూడు వేర్వేరు రంగాలు కాదనీ.. ఒకే పెద్ద బోర్డుపై కదిలే గుళికలని చూపిస్తుంది.
భారతదేశం ఎక్కడ నిలబడాలి? అన్నది మూడు స్థాయిల్లో వేచి చూడాలసిన అంశం
1. ఎనర్జీ ఆధారపడటం: భారతదేశం గల్ఫ్ ప్రాంతంపై చమురు, ఎల్ఎన్ జీ కోసం గణనీయంగా ఆధారపడుతుంది. ఈ పరిస్థితుల్లో హోర్ముజ్ మూసివేత, లేదా బ్లాకేడ్, భారత ఎనర్జీ సెక్యూరిటీకి నేరుగా ముప్పు అనడంలో సందేహం లేదు.
2. స్ట్రాటజిక్ గేమ్: అమెరికా, ఇరాన్ పై ఒత్తిడి పెంచే సమయంలో, ఇండియాను సహజ భాగస్వామిగా చూడాలని అమెరికా ప్రయత్నిస్తున్నది. కానీ ఇరాన్ కూడా చాబహార్, ఇంటర్నేషనల్ నార్త్–సౌత్ కారిడార్, అఫ్గాన్ సెంట్రల్ ఆసియా యాక్సెస్ లో కీలక భాగస్వామి.
రెజీమ్ చేంజ్ వరకు దూరంగా ఉండాలి అనే వాదన. ఇది ఒకింత భావోద్వేగంగా అనిపించినా.. వాస్తవం ఏంటంటే.. ఇరాన్లో రెజీమ్ చేంజ్ ఎప్పుడు? ఎలా, జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు భారతదేశం తన ఎనర్జీ, జియోపాలిటికల్ ప్రయోజనాలను పాజ్ లో పెట్టలేదు.
అందుకే, భారతదేశానికి అసలు ప్రశ్న.. ఎవరితో? కంటే ముందుగా, ఎంత దూరం? ఏ లైన్ దాటకూడదు?”
అంటే, స్ట్రాటజిక్ ఆటోనమీని కాపాడుకుంటూ, ఎనర్జీ సెక్యూరిటీని రక్షించే సున్నితమైన బ్యాలెన్స్.
రష్యా, చైనా, ఇరాన్: పెద్ద గేమ్లో చిన్న మూమెంట్ కాదు
కామెంట్లలో రష్యా హెచ్చరిక ప్రస్తావన, చైనా–ఇరాన్ సంబంధాల నేపథ్యం అన్నీ కలిపి చూస్తే, హోర్ముజ్ మూసివేతను ఇలా కూడా చదవొచ్చు
అమెరికా–ఇరాన్ యుద్ధం ఎక్కువ కాలం సాగితే, చమురు ధరలు ఎగిసిపడితే, రష్యా ఎనర్జీ ఎక్స్పోర్ట్లకు తాత్కాలిక లాభం.
అదే సమయంలో, అమెరికా మిలిటరీ, డిప్లమాటిక్ ఫోకస్ మధ్య ప్రాచ్యంలో బిజీగా ఉంటే, యూరప్, ఉక్రెయిన్, ఆర్క్టిక్ వంటి రంగాల్లో రష్యాకు కొంత స్ట్రాటజిక్ స్పేస్.
చైనా గల్ఫ్ చమురు, గ్యాస్ పై అత్యధికంగా ఆధారపడే దేశం. హోర్ముజ్ మూసివేత, అమెరికా బ్లాకేడ్. చైనా, ఇరాన్ ఎనర్జీ డీల్స్, షాడో ఫ్లీట్, రూట్ డైవర్షన్ ను మరింత గాఢం చేసే అవకాశం.
తన నేవీ పూర్తిగా గల్ఫ్ ను కంట్రోల్ చేయకపోయినా.. కోస్ట్ నుంచి మిసైల్, డ్రోన్ దాడుల ముప్పు చూపించడం ద్వారా, పూర్తి కంట్రోల్ కాకుండా, పూర్తి రిస్క్ సృష్టించడం. అదే అసలు స్ట్రాటజీ.
ఇది ఒక పెద్ద పాఠం.. ఆధునిక యుద్ధాల్లో చోక్ పాయింట్ అంటే కేవలం భౌగోళిక సన్నని మార్గం కాదు.. అది గ్లోబల్ సప్లై చైన్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, పాలిటిక్స్ అన్నీ కలిసిన నాడి.
50 రోజుల తర్వాత ఏమవుతుంది?
- తాత్కాలిక ఓపెనింగ్, షరతులతో కూడిన మూసివేతలు
-ఇప్పటికే మనం చూసినట్టు,
- ఒక రోజు స్ట్రైట్ పూర్తిగా ఓపెన్ అని ప్రకటిస్తారు,
- మరుసటి రోజు కోఆర్డినేటెడ్ రూట్ మాత్రమే అంటారు. ,
o ఇంకో రోజు ఇరాన్ పోర్టులకు బ్లాకేడ్ కొనసాగుతుంది అని అమెరికా చెబుతుంది.
o ఈ ఆన్–ఆఫ్ మోడల్, మార్కెట్లను, షిప్పింగ్ కంపెనీలను, ఇన్సూరర్లను నిరంతర అనిశ్చితిలో ఉంచుతుంది.
2. లిమిటెడ్ డీల్, పెద్ద ప్రశ్నలు ఓపెన్
o అణు ప్రోగ్రామ్, మిలీషియా నెట్ వర్క్, మిసైల్ రేంజ్ వంటి పెద్ద ఇష్యూలపై పూర్తి ఒప్పందం కాకపోయినా, హోర్ముజ్, బ్లాకేడ్, కొన్ని సాంక్షన్లపై లిమిటెడ్ అగ్రిమెంట్ వచ్చే అవకాశం.
3. అనుకోని ఎస్కలేషన్..
- ఒక ట్యాంకర్పై దాడి. ఒక మిసైల్ తప్పుగా మరో దేశ షిప్ ను తాకడం,
ఒక డ్రోన్ స్ట్రైక్ తప్పుగా సివిలియన్ టార్గెట్లను హిట్ చేయడం
ఇవన్నీ పెద్ద ఎస్కలేషన్ కు ట్రిగ్గర్ కావచ్చు.
1. హోర్ముజ్ మూసివేత అంటే కేవలం ఇరాన్–అమెరికా మధ్య యుద్ధం కాదు; అది మన పెట్రోల్ ధర, మన స్టాక్ మార్కెట్, మన కరెన్సీపై కూడా ప్రభావం చూపే సంఘటన.
2. ఇరాన్ ఈ కార్డ్ ను రక్షణ కోసం మాత్రమే కాదు, నెగోషియేషన్ టేబుల్ పై బలమైన బేరసారపు సాధనంగా కూడా ఉపయోగిస్తోంది.
3. అమెరికా – ఇజ్రాయెల్ వ్యూహం, ఇరాన్ రెస్పాన్స్, రష్యా–చైనా పాత్ర ఆన్నీ కలిపి, ఇది ఒక రీజినల్ వార్ కాదు, గ్లోబల్ పవర్ గేమ్.
4. భారతదేశానికి అసలు పరీక్ష.. ఎనర్జీ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ ఆటోనమీ, పశ్చిమ–ఇరాన్–రష్యా–చైనా మధ్య సమతుల్యం— ఈ మూడిటి మధ్య సున్నితమైన సమీకరణను ఎలా నిర్వహిస్తుందనేది.
చివరికి, డే 50 అనేది ఒక టైమ్ స్టాంప్ మాత్రమే. హోర్ముజ్ కథలో అసలు ప్రశ్న.. ఈ జలసంధి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్నది కాదు, ఎవరికి, ఏ షరతులతో, ఎంతకాలం ఓపెన్ గా ఉంటుంది?
అక్కడే ఈ సంక్షోభం యొక్క అసలు రాజకీయ, ఆర్థిక, వ్యూహపరమైన లోతు దాగి ఉంది.
సంకలనం, సేకరణ : సీతారాం కంఠంనేని


.webp)



