బొత్సకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు

posted on: Feb 18, 2026 8:47PM

 

వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ  తరపున న్యాయవాది జి.మల్లిఖార్జున్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. నెయ్యి సరఫరా వివాదంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు  వెల్లడించారు.హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులో బొత్స చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారమని పేర్కొంది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. హెరిటేజ్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని నోటీసులో స్పష్టం చేశారు

వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని బొత్స సత్యనారాయణను సంస్థ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, 2014-19 మధ్య తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ సంస్థ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా అవకతవకలు జరిగాయని ఆయన విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను హెరిటేజ్ సంస్థ పూర్తిగా ఖండించింది. తమ సంస్థ ఎలాంటి అక్రమ ఒప్పందాలు చేసుకోలేదని, అన్ని లావాదేవీలు నిబంధనల ప్రకారమే జరిగాయని పేర్కొన్నాది.

google-ad-img
    Related Sigment News
    • Loading...