Latest News
మేడారం జాతరలో హెలికాప్టర్ సేవలు
posted on: Jan 22, 2026 12:16PM

మేడారం జాతర భక్తుల కోసం గురువారం (జనవరి 22) నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి 6-7 నిమిషాల పాటు జాతరను విహంగ వీక్షణం చేసే విధంగా జాయ్ రైడ్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ జాయ్ రైడ్ ధరను ఒక్కొక్కరికీ నాలుగువేల ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించారు. అది కాకుండా హన్మకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ ద్వారా రానుపోను ప్రయాణానికి 35,999 ధర నిర్ణయించారు. గురువారం (జనవరి 22) ప్రారంభమైన ఈ హెలికాప్టర్ సేవలు ఈ నెల 31 వరకు ఉంటాయి. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఈ రైడ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.






