తప్పెవరిది..గ్లోబల్ ఆస్పత్రిదా, నిఖిల్‌దా?

posted on: Apr 6, 2016 12:42PM

 

లేని దాని కోసం పరిగెత్తడం మనిషికి అలవాటే. ఆ కోవలోకే డబ్బు, అందం, మరేదైనా కావచ్చు. కాని అది మనకి అందుతుందా లేదా అన్నది అర్థం చేసుకోకపోవడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం. తాజాగా నిఖిల్ రెడ్డి అనే యువకుడు 5.7 హైట్ ఉన్నాడు. దేవుడిచ్చిన దానితో తృప్తి చెందక, అసాధ్యమని తెలిసి కూడా ఎత్తు పెరగడానికి ఉన్న అన్ని మార్గాలు ట్రై చేశాడు. చివరికి ఇతగాడి పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్లింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలోని వైద్యులను తన హైట్ పెంచాల్సిందిగా కోరాడు. నిఖిల్ కోరికను క్యాష్ చేసుకునేందుకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు రెడీ అయ్యారు. కాళ్లలో రాడ్లు వేసి హైటు పెంచుతామని 7 లక్షలు రెడీ చేసుకోమని చెప్పారు.

 

తల్లి దండ్రులకు మాట మాత్రమైనా చెప్పకుండా ఆపరేషన్‌కి రెడీ అయ్యాడు నిఖిల్. డాక్టర్లు కూడా పేరేంట్స్‌కి సమాచారం అందించకుండా నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆపరేషన్ చేశారు. తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించకపోయేసరికి నిఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఖిల్ సెల్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నట్లు గుర్తించారు. హస్పటల్ బెడ్ మీద తమ కుమారుడి పరిస్థితిని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు సమాచారం అందించకుండా ఆపరేషన్ చేయడమేంటని వారు ప్రశ్నించారు. అయితే నిఖిల్ మేజర్ కాబట్టి ఆపరేషన్ చేశామని వైద్యులు చేబుతున్నారు.

 

ఇక్కడ నేరం ఎవరిదని చూస్తే నిఖిల్ అత్యాశ, హస్పటల్ కాసుల కక్కుర్తి అని చెప్పవచ్చు. ఒక వయసు దాటిన తర్వాత హైట్ పెరగడం సాధ్యం కాదని తెలియకపోవడం, ఒక వేళ ఆ విషయం తెలిసినా మన ప్రయత్నం మనం చేద్దామని అనుకోవడం నిఖిల్ తప్పు. నిఖిల్‌కి తన తప్పు తనకి తెలియజెప్పి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోయేదానికి కాసుల కోసం కక్కుర్తిపడి నిఖిల్‌ను పూర్తిగా అవిటివాడిని చేశారు గ్లోబల్ వైద్యులు. తల్లిదండ్రుల తప్పు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తమ కుమారుడికి హైట్ పెరగడంపై తీవ్రమైన కోరిక ఉందని గుర్తించకపోవడం ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు. అంతా కలిపి బలి పశువయ్యింది మాత్రం నిఖిల్.

google-ad-img
    Related Sigment News
    • Loading...