రోడ్డు ప్రమాదం.. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

posted on: Jan 31, 2026 7:54AM

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై శనివారం (జనవరి 31) తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం  చోటు చేసుకుంది. ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ ముందు క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్టై డ్రైవర్ అందులో ఇరక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి   గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాల సహాయంతో క్యాబిన్ భాగాలను కట్ చేసి చివరకు డ్రైవర్‌ను క్షేమంగా బయటకు తీయగలిగారు. డ్రైవర్ ను బయటకు తీయడానికి దాదాపు గంట సేపు పట్టింది. అతడిని ఆస్పత్రికి తరలించి రోడ్డును క్లియర్ చేశారు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...