తాడ్వాయి, మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్

posted on: Jan 30, 2026 1:47PM

తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం జాతర కు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. జాతర మూడో రోజు శుక్రవారం మేడారం జాతరకు వెళ్లా దారులన్నిటిలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ముఖ్యంగా తాడ్వాయి- మేడారం మార్గంలో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బస్సులు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. కాలినడక కూడా కష్ట సాధ్యమన్నంత స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జాతర రద్దీకి వరుస సెలవులు తోడు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...