Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీపై రెండు ద్రోణులు.. వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలు
posted on: Jun 29, 2026 10:04AM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీపై ప్రస్తుతం ఒకేసారి రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం బలంగా కొనసాగుతోందనీ, వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ అల్పపీడన ద్రోణులకు తోడు రుతుపవనాల కదలిక కూడా చురుకుగా ఉండటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హచ్చరించింది. ఏపీలో ఒక ద్రోణి ఉత్తర కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. రెండో ద్రోణి కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కన్యాకుమారి వరకు కొనసాగుతోంది.
ఇలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో అత్యధికంగా 68.2 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే విజయనగరం జిల్లా రాజంలో 52.5 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా కాకుమానులో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదింది. తాడేపల్లిలో 45.2 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా కవలూరులో 41.5 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో 39.9 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది.






