తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!

posted on: Jul 30, 2026 9:52AM

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలకు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  

వాతావరణ శాఖ వెల్లడించిన  సమాచారం ప్రకారం, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో గురువారం (జులై 30) అతి భారీ వర్షాలు కురుస్తాయి.  అలాగే..  జగిత్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఇలా ఉండగా..  సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు  వర్షాలు నమోదు కావచ్చని వాతవరణ శాఖ పేర్కొంది.    హైదరాబాద్  పరిధిలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటే తప్ప సాధారణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాల విషయంలో తగిన నివారణ చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది. 

అదలా ఉండగా  ఆంధ్రప్రదేశ్ లోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి.  ఏపీలోని పలు జిల్లాలలో గురు, శుక్రవారాలలో (జులై 30, 31)   మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   పోలవరం,  తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.  రహదారులపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.   

Telangana Rains Update, Heavy Rainfall,  Orange Alert, Hyderabad Weather Forecast 

google-ad-img
    Related Sigment News
    • Loading...