Latest News

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం…భారీగా ట్రాఫిక్ జామ్

posted on: Mar 24, 2026 8:50PM

 

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.. ఈరోజు మంగళవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి విస్తృ తంగా వర్షాలు కురిశాయి. ఎండలతో అలసిపోయిన నగరవాసులకు ఈ వాన కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పలుచోట్ల ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగిం చింది...నగరంలోని కూకట్‌ పల్లి, ముసాపేట్, కేపీహెచ్‌బీ, జగద్గిరిగుట్ట, నిజాంపేట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, మియాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం పడడంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నెమ్మదించింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలు దేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు... ఇకపోతే కుషాయిగూడ, కీసర, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, చర్లపల్లి, నాగారం ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురవడం గమనార్హం. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినట్లు సమాచారం.

నగర హృదయ ప్రాంతాలైన బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌ బజార్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, గోషామహల్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వ్యాపార ప్రాంతాల్లో రద్దీ తగ్గి, దుకాణాల ముందు నీరు నిలిచిన దృశ్యాలు కనిపించాయి. రాజేంద్రనగర్‌లో భారీ వర్షం కురవగా, చందనగర్, లింగంపల్లి, నల్లగండ్ల ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలతో నగరంలోని పలు రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే గంటల్లో కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగవచ్చని అంచనా. ప్రజలు అవసరం లేకపోతే బయటకు వెళ్ల కుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...