Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణకు భారీ వర్ష సూచన.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్.!
posted on: Jul 29, 2026 3:42PM

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే మంగళ, బుధ (జులై 28, 29) తేదీలలో తెలంగాణలోన పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. రానున్న రెండు మూడు రోజులలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమౌంది. ముఖ్యంగా పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజులలో కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం గురు, శుక్రవారాల్లో (జులై 30, 31) సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల పట్టణాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Telangana Rains, IMD Yellow Alert, Telangana Weather Forecast, Hyderabad Rains Update, Depression Rain Alert



.webp)


