గుల్‌కంద్‌తో  మలబద్దకం సమస్యలు  పరార్!

 

మలబద్దకం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.  ఆహారం ఎలాంటి సంకోచం లేకుండా హాయిగా తినాలంటే తిన్న ఆహారం బాగా జీర్ణమై ఆహారపు వ్యర్థాలు మలం రూపంలో అంతే సాఫీగా బయటకు వెళ్లిపోవాలి. కానీ కొందరిలో మలవిసర్జన సాఫీగా జరగదు. ఈ విషయం గురించి ఎవరితో అయినా మాట్లాడటమే కాదు.. కనీసం వైద్యుల దగ్గరకు వెళ్లాలన్నా కూడా సంకోచిస్తారు చాలామంది.  అయితే మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈజీ

మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి మంచి సువాసన కలిగిన గులాబీ రేకలు బాగా సహాయపడతాయి.  గులాబీ పువ్వును సాధారణంగా అలంకరణ కోసం,  పూజ కోసం మాత్రమే వాడుతుంటారు. కొందరు వంటకాలలో వాడినప్పటికి అవన్నీ కేవలం సువాసన కోసమే ఉపయోగిస్తారు. గులాబీ కడుపు సంబంధ సమస్యలనే కాకుండా మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. పొట్టలో యాసిడ్ లు ఎక్కువ ఉత్పత్తి అయ్యే సమస్యకు ఇది చెక్ పెడుతుంది. గులాబీ రేకలతో గుల్కండ్ తయారు చేసి తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.  గుల్కండ్ ను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు.

గుల్‌కంద్‌ తయారీకి కావలసిన పదార్థాలు..

నాటీ గులాబీ రేకలు..

చక్కెర..

తేనె..

నల్ల మిరియాలు..

పచ్చి ఏలకులు..

తయారీ విధానం..

గులాబీ రేకులను ఒక రోటిలో వేసి బాగా నూరాలి. ఇందులోనే పంచదార, తర్వాత తేనె కూడా కలపాలి. రుచి కోసం కాస్త నల్ల మిరియాలు వేసి బాగా రుబ్బుకోవాలి.  ఇందులో కాస్త యాలకులు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి ఎండలో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఎవరైనా తీసుకోవచ్చు.  కానీ మలబద్దకం ఉన్నవారికి, ప్రేగు శోథ సమస్యలు ఉన్నవారికి ఇది గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది కడుపు సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. మరొక విషయం ఏమిటంటే.. ఈ గుల్కండ్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

                               *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...