Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అలసందలంటే అలుసా
posted on: May 5, 2018 10:21AM

అలసందలు - వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు. నవధాన్యాలలో ఒకటైన అలసందలలో పోషకవిలువలు అమోఘంగా ఉంటాయి. వీటిలో కాలరీలు తక్కువగా ఉండటం వల్ల లో కాలరీ ఫుడ్ గా పేరు పొందాయి. అలాగే పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచిది. షుగర్ పేషెంట్స్ కి అద్భుతమైన ఆహారం.
ఇంతకీ ఇందులో దాగి ఉన్న గుణాలు ఏంటో చూద్దామా? ఈ బొబ్బర్లలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలోనూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచడంలోనూ సహాయపడతాయి. అంతే కాదు శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరమైన టాక్సిన్స్ ను కూడా నియంత్రిస్తాయి.

అలసందలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల కడుపులో అనుకూల ప్రభావంను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పొట్ట అసౌకర్యాన్ని నివారిస్తుంది . మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వీటిలో పుష్కలంగా లభించే విటమిన్ k మెదడు చురుగ్గా పనిచేయటంలో దోహదపడుతుంది. అంతేకాక నరాలకు కూడా బలాన్నిస్తుంది. బొబ్బర్లలో ఉండే ఐరన్,మెగ్నీషియం మన ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి.
ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఒంట్లో కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన అలసందలు తింటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం . ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తినటం వల్ల కడుపు బరువుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. లావుగా ఉంది సన్నగా తయారనుకునేవారు కూడా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ తేడాను గమనించచ్చు.
ఇన్ని విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలసందలని అలుసుగా చూడకుండా రోజువారి ఆహారంలో తింటూ ఉంటే మనకి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా లభిస్తుంది.
...కళ్యాణి





