Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన రికార్డు వెనుక నిజాలు
posted on: Jun 13, 2026 3:25PM

తెలుగువన్ ప్రత్యేకం
భారతదేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పాటు సేవలందించిన నేతగా సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అరుదైన మైలురాయి ఆవిష్కృతమైంది. దేశంలో అత్యంత సుస్థిరమైన పరిపాలనను అందించడంలో ఈ కాలపరిమితి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు. ప్రస్తుత ప్రధాని మోదీని అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా అభివర్ణించడానికి అదే కారణమన్నారు. కారణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 1947 నుండి దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే 1952 వరకు నెహ్రూ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. అలాగే ఇందిరా గాంధీ పరిపాలన కాలం మధ్యలో విరామం వచ్చింది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించి, నిరంతరాయంగా 4399 రోజులకు పైగా అధికారంలో కొనసాగుతున్న ఏకైక ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.
ఇక మోడీ పుష్కర కాల పాలనలో మౌలిక వసతుల కల్పన, ఆర్థిక సంస్కరణల పరంగా దేశం ఎంతో ప్రగతిని సాధించిందనీ.. ముఖ్యంగా దేశంలో బహుమితీయ పేదరికం (మల్టీ డైమెన్షనల్ పావర్టీ) గతంలో ఉన్న 27 శాతం నుండి ప్రస్తుతం 13 శాతానికి తగ్గుముఖం పట్టిందనీ అన్నారు.
అయితే అదే సమయంలో సంపద పంపిణీలో సమానత్వం లేకపోవడం, కొన్ని రంగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోవడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. కొన్ని కీలకమైన విధానపరమైన నిర్ణయాలు మరింత ముందే తీసుకోవాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి హెచ్చుతగ్గులు సహజమైనప్పటికీ, ప్రస్తుత దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ అంతటి శక్తివంతమైన నాయకుడు మరే ఇతర పార్టీలోనూ లేరనేది విశ్లేషించారు. మోడీ హయాంలో రాజకీయ సుస్థిరత, ప్రజా సంక్షేమం, దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.
ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి



.webp)


