Latest News

హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం

posted on: Mar 13, 2026 6:40PM

 

హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌  గురువారం తన రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రక్రియ మార్చి 19 వరకు కొనసాగనుంది.హెచ్‌-1బీ వీసాలపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి రిజిస్ట్రేషన్లు ఇవే కావడం విశేషం.

ముఖ్యమైన మార్పులు ఇవే:

వేతనానికి ప్రాధాన్యం: లాటరీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఎక్కువ వేతనం పొందే నిపుణులకు లాటరీలో అధిక ప్రాధాన్యం లభిస్తుంది.

కంపెనీలపై ప్రభావం : ఈ మార్పుల వల్ల కన్సల్టెన్సీల ద్వారా జరిగే నియామకాలపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, సీనియర్ నిపుణులను నియమించుకునే పెద్ద కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.

ఫీజు వివరాలు : ప్రతి రిజిస్ట్రేషన్‌కు కంపెనీలు 215 డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి ఎంపికైతే, వేతన ప్యాకేజీ ఇతర ఖర్చులతో కలిపి కంపెనీలు సుమారు లక్ష డాలర్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వీసాల కోటా:

హెచ్‌-1బీ వీసాలకు ఏటా భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం 85,000 వీసాలను మాత్రమే యూఎస్‌ ప్రభుత్వం జారీ చేస్తుంది.వీటిలో 20,000 వీసాలు అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య (మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ) పూర్తి చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు.మిగిలిన 65,000 వీసాలు జనరల్ కేటగిరీ కింద అందరికీ అందుబాటులో ఉంటాయి

google-ad-img
    Related Sigment News
    • Loading...