ప్రభుత్వమే హింసకు పాల్పడింది- జాట్ నేత

posted on: Feb 29, 2016 4:38PM

 

హర్యానాకు వారం రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన జాట్‌ వర్గ ఉద్యమం గుర్తుండే ఉంటుంది. తమ వర్గానికి రిజర్వేషన్లు కావాలంటూ జాట్‌లు చేసిన ఈ ఉద్యమం ప్రజాజీవనాన్ని స్తంభింపచేయడమే కాకుండా, చాలాచోట్ల హింసాత్మకంగా మారింది. ప్రయాణాలు నిలిచిపోయాయి, నిత్యావసర వస్తువులు దొరక్కుండా పోయాయి, పిల్లలు ఆకలితో అలమటించారు. ఆందోళనకారులుకూ పోలీసులకు మధ్య జరిగిన గొడవలలో దాదాపు 30 మంది మృతి చెందారు. ఇక ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికైతే లెక్కే లేకుండా పోయింది. ఆఖరికి ఆందోళన ముసుగులో అత్యాచారాలు సైతం జరిగిన వార్తలు వినిపించాయి.

ఇంత జరిగిన తరువాత జాట్ ఉద్యమ నేత యశపాల్ నేత చల్లగా ‘మాకు హింసకీ సంబంధమే లేదు’ అని చెబుతున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు ఆ పార్టీ నేతలే కుట్ర పన్నారనీ... వారే హింసకు, విధ్వంసానికీ పాల్పడ్డారనీ యశ్‌పాల్ ఉవాచ. జాట్‌లు నిజంగా ఆందోళన చేసిన చోట ఉద్యమం చాలా ప్రశాంతంగా జరిగిందని భరోసా ఇస్తున్నారు ఆయన. ప్రభుత్వమే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారి మీద తుపాకులు ఎక్కుపెట్టిందని ఆరోపిస్తున్నారు. అందుకని కేసులంటూ పెడితే జాట్‌లకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నేతల మీదే పెట్టాలని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...