Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పండగలా పచ్చదనం పెంచే పని... 40 కోట్ల టార్గెట్‌గా తెలంగాణలో ఏర్పాట్లు
posted on: Jun 5, 2017 2:59PM

తెలంగాణలో మూడో విడత హారితహారానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24శాతం పచ్చదనాన్ని.... 33 పర్సంటేజ్‌కి చేర్చడమే లక్ష్యంగా థర్డ్ ఫేజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో 2 కోట్ల 10 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అలాగే సిద్దిపేట, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 2 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 2వేల 925 నర్సరీల్లో ఈ మొక్కలను సిద్ధంచేస్తున్నారు.
హరితహారం కార్యక్రమానికి రుతుపవనాల రాకే సరైన సమయమని భావిస్తోన్న ప్రభుత్వం.... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈసారి పెద్దఎత్తున పండ్ల మొక్కలను నాటనున్నారు. ముఖ్యంగా ఉసిరి, నేరేడు, మేడి, పనస, జామ మొక్కలతోపాటు తాటి, ఈత, టేకు చెట్లను పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు.
రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం.... రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల మేర మూడో విడత హారితహారం చేపట్టనున్నారు. అలాగే సీడ్ బాంబింగ్ పేరిట మట్టి, విత్తనాలు కలిపి తయారు చేసిన విత్తన బంతులను గుట్టల్లో చల్లనున్నారు. మొత్తానికి జులై ఫస్ట్ వీక్‌లో పండుగలాగా మూడో విడత హారితహారం చేపట్టనున్నారు.


.jpg)



