Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Ustaad Bhagat Singh: ఈ సారి నిలబడతాడా! ఆ స్పీచ్ ఏంటి స్వామి
posted on: Mar 16, 2026 1:07PM

-ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే
-ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న హరీష్ శంకర్ మాటలు
-హిట్ అందుకుంటాడా!
మాస్, క్లాస్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడుగా హరీష్ శంకర్(Harish Shankar)కి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. టేకింగ్, డైలాగ్స్ పరంగా కూడా తనకంటు సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హరీష్ శంకర్ ప్రీవియస్ మూవీ మిస్టర్ బచ్చన్ పరాజయంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19 న విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అభిమానుల్లో అయితే అంచనాల రేంజ్ ఊహలకి కూడా అందని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి అవేంటో చూద్దాం.
హరీష్ శంకర్ మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్(UStaad Bhagat singh)ఆలస్యానికి, ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోవడానికి నేనే కారణం. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు స్టోరీ అనుకున్నాం. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. అప్పటినుంచి ఎంతో ఉత్సాహంతో చేసాం. ఆయన పరుగెత్తారు, మమ్మల్ని పరుగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇప్పుడు ఆ డైలాగ్ మార్చుకున్నాను. కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది. నా గుండె లోపల పవన్ కళ్యాణే, నా గుండె బయట పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే. పగలు ప్రజాసేవలో ఉండి, రాత్రుళ్ళు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రాణం పెట్టి పనిచేశారు ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ . ఉస్తాద్ కోసం అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు.
కాలరే ఎత్తరా సాంగ్ సెట్ మైత్రి కెరీర్ లోనే అతి పెద్ద సెట్. ఆనంద్ సాయి గారు అద్భుతమైన సెట్ లు వేశారు. కథ మారినా, నా గురించి బయట కథలు కథలుగా చెప్పుకున్నా రెండున్నరేళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ గారికి కృతఙ్ఞతలు. మా రమేష్ రెడ్డి గారికి, ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ గారికి కూడా కృతఙ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే, తెర వెనుక హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన పాటలు అందించారు. అలాగే థమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఉగాదికి తీసుకొస్తున్నాం. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారు గొప్ప క్యారెక్టర్స్ పోషించారు.
also read: Ustaad Bhagat Singh: పవన్ గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు సబబేనా!.. ఐరెన్ లెగ్ ముద్ర పోతుందా!
శ్రీలీల(Sreeleela)గారు అనగానే అందరికీ డ్యాన్స్ లు గుర్తుకొస్తాయి. ఇక ఉస్తాద్ తో తన పెర్ఫార్మ్ గురించి మాట్లాడుకుంటారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ లు ఈ సినిమాలో చూస్తారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పని చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. మార్చి 19న థియేటర్లలో ఉస్తాద్ ఉగాది జరుపుకుందామని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. అభిమానులైతే హరీష్ శంకర్, పవన్ మరో సారి గబ్బర్ సింగ్ ని మించి విజయాన్ని అందుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.







