హరీశ్ రావు ఎక్కడ...వెళ్లాడా.. పంపించారా...?

posted on: Nov 29, 2017 2:23PM

 

హైదరాబాద్ కలల ప్రాజెక్టు ‘మెట్రో రైలు’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఆయన సీఎం కేసీఆర్‌, కేటీఆర్ ఇంకా పలువురు మంత్రులతో కలిసి.. మియాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లికి ప్రయాణించారు మోడీ. ఇక ఈ కార్యక్రమంలో మోడీ కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. కేటీఆర్ ఎక్కడని పిలిచిమరీ వచ్చేదాకా ఆగి ప్రారంభోత్సవం జరిపారు. అంతేకాదు.. రైల్లో కూడా కేటీఆర్ పక్కనే కూర్చున్నారు. కేటీఆర్ చెప్పే విషయాలను ఆసక్తికరంగా విన్నారు. ఇంకా మెట్రో కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు చాలా మంది వచ్చారు.

 

అయితే ఇంత హడావుడి జరుగుతున్నా.. ఆ కార్యక్రమంలో ఓ మనిషి మాత్రం కనిపించడంలేదు. ఇప్పటికే బల్బు వెలిగిఉంటుంది.... అదేనండి కేసీఆర్ మేనల్లుడు..టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. హరీశ్ రావు ఎక్కడున్నాడు.. ఎక్కడికి వెళ్లాడు..ఇవే ప్రశ్నలు... అయితే నిన్న మెట్రో ప్రారంభోత్సవం జరుగుతుంటే..  హరీష్ రావు ఢిల్లీ వెళ్లారట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అటవీ,పర్యావరణ అనుమతుల కోసం కేంద్రాన్ని అభ్యర్ధించడానికి హరీష్ ఢిల్లీ వచ్చారట. జలవనరుల సంఘం అధికారులతో హరీష్ ఈ విషయం తో పాటు తెలంగాణకు సంబంధించిన మిగిలిన సమస్యలపై కూడా దృష్టి పెడతారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...ఆ అధికారులతో హరీశ్ రావు ఈరోజు భేటీ అవ్వనున్నారు. దానికి ఒక్కరోజు ముందే ఢిల్లీ వెళ్లాల్సిన పని లేదు. దీనివల్లే ఎక్కడాలేని డౌట్లు వస్తున్నాయి. ఆ ముందు జాగ్రత్త హరీష్ దేనా లేక కెసిఆర్ దా? అని కూడా అనుకుంటున్నారు.. ఈరోజు సమావేశం అయితే... దానికి ఒకరోజు ముందే వెళ్లాల్సిన అవసరం లేదే అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

 

గతంలోనే కేసీఆర్ కుటుంబానికి... హరీశ్ రావుకు మద్య విబేధాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు... రాష్ట్రం విడిపోక ముందు.. విడిపోయిన తరువాత కొన్ని రోజులు కూడా కేసీఆర్ పక్కన హరీశ్ రావు కుడి భుజంగా ఉండేవాడు. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. హరీశ్ రావు స్థానం కూడా తగ్గుకుంటూ వస్తుందని చెప్పొచ్చు. ఒకప్పుడు కేసీఆర్ తరువాత రెండో స్థానం ఎవరిది అంటే టక్కున హరీశ్ రావు అన్న పేరు వచ్చేది. కానీ ఇప్పుడు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజుల నుండి అయితే అసలు హరీశ్ రావు కనిపించడమే అరుదైపోయింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా.. తాను పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. మరి దీని వెనుక ఉన్నకారణాలు ఏంటీ... ఎంత తమ మధ్య విబేధాలు లేవు అని చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విబేధాలు ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది ..

google-ad-img
    Related Sigment News
    • Loading...