హరిరాం అక్రమాస్తులు.. వంద కోట్లు పైమాటే!?

కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది  ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ  హరిరాంను గజ్వేల్ లో శనివారం (ఏప్రిల్ 26)అరెస్టు చేసింది. ఈ సందర్భంగా హరిరాం విలాసవతంతమైన ఆస్తుల జాబితా విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే..

షేక్‌పేటలో లగ్జరీ విల్లా, కొండాపూర్‌లో లగ్జరీ విల్లా, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్, మాదాపూర్‌లో ఫ్లాట్, నార్సింగిలో ఫ్లాట్, అమరావతిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండివిడ్యువల్ హౌసెస్, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో మామిడి తోటతో కూడుకున్న ఫామ్ హౌస్. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి, కుత్బుల్లా పూర్ లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో మరో ఓపెన్ ప్లాట్, ఒక బీఎండబల్యూ కారుతో సహా.. 2 ఇతర వామనాలు తమ సోదాల్లో వెలుగులోకి తీశారు అధికారులు. ఇంకా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లతో కలుపుకుని సుమారు ఈ అక్రమాస్తుల   విలువ వంద కోట్ల మేర ఉండొచ్చని అంచనా. 

హరిరాంను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అధికారులు. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయట పెట్టింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నివేదిక విడుదలైన కాసేపటికే ఇది జరగడం గమనార్హం.