Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...DNA టెస్ట్ పేరుతో వేధింపులు.. 5 నెలల గర్భిణి ఆత్మహత్య
posted on: Jun 27, 2026 12:35PM

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి సుస్మిత (24) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఏడాదిన్నర క్రితం వివాహమైన సుస్మిత, భర్తతో కలిసి అత్తింట్లో నివాసముంటోంది. సుస్మితపై భర్తకు అనుమానం ఉండేది. గర్భంలో ఉన్న శిశువుకు DNA పరీక్ష చేయించాలని తరచూ ఒత్తిడికి గురి చేసేవాడు. ఈ విషయంలో అత్తమామలు కూడా భర్తతో కలిసి కోడలు సుస్మితను వేధింపులకు గురి చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కూతురు మరణించిందని తెలియ గానే తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని, అత్తింటి వారే పక్కా ప్రణాళికతో తన కూతురిని హత్య చేశారని మృతురాలి తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యుల ఆరోప ణలు, వేధింపుల అంశం, ఇతర పరిస్థితులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.


.webp)
.webp)


