వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్
posted on: Oct 31, 2025 4:24PM

హనుమకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. సమ్మయ్య నగర్‌లో దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. అనంతరం వరద బాధితులను నేరుగా కలిసి వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. సమస్యలపై స్థానికులు ముఖ్యమంత్రి వారి గోడును విన్నవించారు. అంతకు ముందు సీఎం రేవంత్ హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్ లో తుపాను ముంపు ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను వీక్షించనున్నారు.
కలెక్టర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గురువారమే ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో రద్దు అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే సాధ్యం కాదని అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మొంథా తుపానుతో ఉమ్మడి వరంగల్ జిల్లా, సిద్ధిపేట జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. ఇళ్లు నీటమునిగాయి. వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.






