Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ..."సిగ్గు" లేని బ్యాంకుల జాబితాలోకి ఎస్‌బీఐ
posted on: Jun 21, 2016 3:54PM
.jpg)
దేశంలోనే అత్యంత పురాతన బ్యాంకుగా..అతిపెద్ద బ్యాంకుగా ఘనత వహించిన "భారతీయ స్టేట్ బ్యాంక్" ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రయాణంలో మంచి పేరుతో పాటు చెడ్డ పేరు కూడా సంపాదించింది ఎస్‌బీఐ. అంతర్జాతీయంగా "హాల్ ఆఫ్ షేమ్" బ్యాంకుల జాబితాలోకి ఎస్‌బీఐ చోటు సంపాదించింది. ఇదేదో గొప్ప పురస్కారం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రపంచ వినాశనానికి కారణమయ్యే క్లస్టర్ బాంబులు, మారణాయుధాలను తయారు చేస్తున్న కంపెనీలకు రుణ సహాయం చేస్తున్న 158 బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల పేర్లను ప్రకటిస్తూ డచ్‌కు చెందిన "పీఏఎక్స్" "హాల్ ఆఫ్ షేమ్" జాబితాను ప్రచురించింది.
అమెరికా కేంద్రంగా బాంబులు, రాకెట్ సిస్టమ్స్ తయారు చేస్తున్న "ఆర్బిటాల్ ఏటీకే" అనే సంస్థకు ఎస్‌బీఐ భారీ ఎత్తున రుణమిచ్చిందని పీఏఎక్స్ పేర్కొంది. ఈ కారణంగానే హాల్ ఆఫ్ షేమ్ జాబితాలో ఎస్‌బీఐను చేర్చింది. జేపీ మోర్గాన్, బార్ల్కేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూయిస్ తదితర దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వినాశనానికి అవసరమయ్యే ఆయుధాలు తయారు చేస్తున్న ఏడు సంస్థలకు 28 బిలియన్ డాలర్ల రుణాలు అందించాయి.
ఈ కంపెనీలకు రుణాలివ్వడంపై నిషేధం ఉన్నప్పటికీ ఆయా బ్యాంకులు పట్టించుకోవడం లేదని పీఏఎక్స్ ఆరోపించింది. ఈ జాబితాలో ఆమెరికాకు చెందిన 74 బ్యాంకులు, చైనా నుంచి 29, దక్షిణ కొరియా నుంచి 26 సంస్థలున్నాయి. ఇక భారత్ నుంచి ఈ సిగ్గులేని బ్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థ ఎస్‌బీఐ కావడం దురదృష్టకరం. దీనిపై స్టేట్ బ్యాంక్ స్పందించింది, ఆర్బిటాల్ ఏటీకేకు తాము మాత్రమే రుణమివ్వలేదని..అది ప్రపంచ బ్యాంకుల కన్సార్టియం రూపంలో ఇచ్చామని తెలిపింది. వేల్స్ ఫార్గో, బీఓఏ మెర్రిల్ లించ్, సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ టోక్యో వంటి బ్యాంకులతో కలిసి తాము రుణమిచ్చామని వివరించారు.


.jpg)



