తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

posted on: Feb 17, 2026 1:42PM

 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయి. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు.

పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక సమయాలు

పదో తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు జరుగుతున్నంతకాలం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

వేసవి సెలవుల తేదీలు ప్రకటింపు

విద్యాసంస్థలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్స రం ప్రారంభమవుతుంది.

రంజాన్ సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు

రంజాన్ నెలను పురస్క రించుకుని ఉర్దూ మీడియం పాఠశాలలు, డైట్ కళాశాల ల్లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ప్రత్యేక సమయాలు అమలు చేయనున్నారు. ఈ కాలంలో ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు నిర్వహిస్తారు. మార్చి 20 తర్వాత కోల్పోయిన బోధన సమయాన్ని భర్తీ చేసేందుకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మార్పులకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకో వాలని పాఠశాల విద్యాశాఖ కోరింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...