రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టండి..
posted on: Apr 6, 2021 5:44PM
దేశంలో కరోనా విలయం తీవ్రంగా కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఎక్కువ భారీగా కేసులు నమోదు కాగా.. గుజరాత్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పెరుగుతుండటంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుజరాత్ హైకోర్టు కోరింది.
వారాంతంలో కర్ఫ్యూ విధించడంపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో హాజరు అయ్యే రాజకీయ సమావేశాలు, ఇతర వేడుకల నిర్వహణను నిలిపేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.


.jpg)
.jpg)


