సీఎంనే కంటతడి పెట్టించింది..

posted on: Jun 10, 2016 6:00PM

దేశంలో నానాటికి తగ్గిపోతున్న స్తీ, పురుష లింగ నిష్పత్తి గురించి మాట్లాడి సాక్షాత్తూ ముఖ్యమంత్రినే కంటతడి పెట్టించింది ఓ బాలిక. గుజరాత్‌లోని ఖేడా జిల్లా మహుదా పరిధిలోని హెరంజి గ్రామానికి చెందిన బాలిక అంబికా గోహెల్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో వారి స్కూలు ప్రాంగణంలో భ్రూణ హత్యల గురించి ఒక సభ జరిగింది. ఆ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభలో భ్రూణహత్యకు గురైన ఓ ఆడశిశువు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా ఊహాజనిత కల్పిత లేఖను అంబికా చదివి వినిపించింది.

 

తల్లిగర్భంలో మరణించిన ఆడశిశువుకు కూడా ప్రపంచాన్ని చూడాలని ఉంటుందని, కాని ఆ అవకాశాన్ని తల్లిదండ్రులు ఇవ్వట్లేదని మృత శిశువు ఆవేదనను కళ్లకు కట్టింది."నేను ఆడపిల్ల అని తెలియగానే గర్భంలో నన్ను చంపేశారు. అమ్మా ఓ విషయం గుర్తుంచుకో ఆడపిల్ల లేకుంటే ఇల్లు ఇల్లే కాదు" అంటూ భావోద్వేగంతో ఆ లేఖను చదివింది. అంబికా ఆ లేఖ చదువుతున్నంతసేపు వేదికపై కూర్చున్న ఆనందీ బెన్ పటేల్ సహా సభికులందరూ కంటతడి పెట్టారు. బాలిక ప్రసంగించిన వెంటనే సీఎం కూర్చీలోంచి లేచొచ్చి అంబికాను అప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలిక తనకు డాక్టర్ కావాలని ఉందని ఆనందీతో చెప్పడంతో అందుకు తగిన సాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మొత్తానికి తన ప్రసంగంతో సీఎంనే చలించేలా చేసిన అంబికా అభినందనీయురాలు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...