Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శనిసింగనాపూర్ ఆలయంలో పాదం మోపిన మహిళలు
posted on: Apr 8, 2016 3:39PM
.jpg)
మహారాష్ట్ర మహిళలు ఎట్టకేలకు గొప్ప విజయం సాధించారు. ప్రఖ్యాత శనిసింగనాపూర్ ఆలయంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఈ ఆలయం సంప్రదాయం ప్రకారం మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధిం. అయితే పురుషులతో పాటు తమకు అన్నింట్లో సమాన అవకాశాలున్నాయని తాము ఆలయ ప్రవేశం చేస్తామంటూ భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు పెద్ద పోరాటం సాగించారు. అయితే పదేపదే వీరి ప్రయత్నాన్ని స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై భూమాతా కార్యకర్తలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కూడా వీరి వాదనతో ఏకీభవించి ఆలయంలోకి అనుమతించాల్సిందిగా ఆదేశించింది.
న్యాయస్థానం తీర్పుతో ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలను మరోసారి స్థానికులు, ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శనిసింగనాపూర్ దేవాలయ ట్రస్ట్ అధికారులు సమావేశమై ఇటువంటి గొడవలు లేకుండా ఉండటానికి ఆలయ కట్టుబాట్లు దెబ్బతినకుండా ఉండేందుకు పురుషులకు కూడా నిషేధం విధించారు. దీంతో స్త్రీలకు, పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారు కూడా ఆలయంలోకి వెళ్లలేకపోయారు. అయితే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 100 మంది పురుషులు ట్రస్ట్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బలవంతంగా ఆలయం లోపలికి చొచ్చుకెళ్లారు. గర్భగుడి వద్దకు వెళ్లి జలార్చన చేయడం ప్రారంభించారు. ఈ వార్త బయటకు వ్యాపించిన నిమిషాల్లోనే ఈ రోజు మహిళలకు కూడా అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. దీంతో భూమాతా బ్రిగేడ్ సారథి తృప్తి దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహిళలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.



.jpg)


