Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇంటిపై గంజాయి సాగు...సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
posted on: Apr 21, 2026 4:40PM
.webp)
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే పరిమితమైంది. చెడు సావాసం కారణంగా యువకుడు తన జీవితాన్నే తలకిందులు చేసుకున్నాడు. చివరకు ఐటీ ఉద్యోగి నుంచి గంజాయి రైతుగా మారి పోలీసుల చేతికి చిక్కాడు. సిహెచ్ శశిధర్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఉద్యోగం వచ్చిందన్న వార్తతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే కొద్దికాలానికే చెడు స్నేహితుల ప్రభావంతో గంజాయికి బానిసయ్యాడు.
జీతం మొత్తం ఖర్చవడంతో ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు.డబ్బుల కొరత రావడంతో మరింత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. గంజాయి కొనడానికి డబ్బు లేకపోవడంతో తన ఇంటి పైకప్పుపైనే గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ దాడి చేసి అక్కడ పెంచుతున్న గంజాయి మొక్కలను చూసి షాక్‌కు గురయ్యారు. శశిధర్ ఇంటి పైకప్పుపై మొత్తం 17 గంజాయి మొక్కలు కనిపించాయి. వాటిలో కొన్ని పూత దశలో ఉండగా, మరికొన్ని మూడు మీటర్ల ఎత్తు వరకు పెరిగి ఉన్నాయి. ఈ మొక్కల నుంచి సుమారు 10 కిలోల గంజాయి లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో శశిధర్‌ను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.
ఇంతటితో కథ ముగియలేదు…
అదే టీమ్ మేడిపాటి నగర్‌లో మరో కేసును ఛేదించింది. బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బండి అరుణ్ కుమార్, బి. ఆశిష్‌లను కూడా అరెస్టు చేశారు.ఈ రెండు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను అధికారులు అభినందించారు.






