Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫుల్ గా మందుకొట్టి వచ్చిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ అన్న వధువు
posted on: Apr 28, 2026 11:32AM
.webp)
పెళ్లి వేదికపైనే పెళ్లిని రద్దు చేసుకున్న వధువు ఉదంతమింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని హపూర్ లో జరిగింది. ఇంతకీ వధువు పెళ్లి ఎందుకు రద్దు చేసుకుందంటే.. వరుడు మద్యం తాగి పెళ్లి వేదికపైకి రావడమే. హపూర్‌కు చెందిన ఒక యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, పెళ్లి రోజున వరుడు తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. కనీసం స్టడీగా నడవలేని స్థితిలో పెళ్లివేదికపైకి వచ్చి తూలిపడిన వరుడి తీరు చూసి షాక్ తిన్న వధువు.. క్షణం ఆలస్యం చేయకుండా తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.
పెళ్లికి వచ్చిన వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ఈ సందర్భంగా వధువు.. కనీసం తన కాళ్లపై తాను సరిగ్గా నిలబడలేని వ్యక్తి.. రేపు నన్ను ఎలా పోషిస్తాడు? నా బాధ్యత ఎలా తీసుకుంటాడు?" అని ఆమె సూటిగా ప్రశ్నించింది. మద్యానికి బానిసైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేనని స్పష్టం చేసి ఆమె వేదిక దిగి వెళ్ళిపోయింది. వధువు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజనులు స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ మద్దతు లభిస్తోంది. బాధ్యత లేని వరుడికి సరైన బుద్ధి చెప్పిందంటూ ఆమె ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు.


.webp)



