ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ : పల్లా శ్రీనివాస్

 

మంగళగిరి నియోజకవర్గాల్లో సరిగ్గా గ్రీవెన్స్ నిర్వహించడం లేదని, నాయకులు ప్రజల సమస్యలు సరైన రీతిలో పరిష్కరించివుంటే మంత్రి లోకేష్  ప్రజాదర్బార్ కు 4వేల మంది ఎందుకు వస్తారు అని నాయకులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు మండిపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యటించిన ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలతో ఆయన మాట్లాడుతూ.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని ఆదేశించారు. 

ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరారు. నవంబర్ 15వ తేది లోపు నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు పార్టీ నియామకాలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. 15వ తేది లోపు పూర్తి చేయలేకపోతే జాతీయ అధ్యక్షులు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంస్కృతి. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. కొందరి నాయకుల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, మరలా పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో పార్టీ నాయకులు సఫలం కావాలి, దానికి తగ్గట్టు నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో నిర్వహిస్తూ.. క్యాడర్ ను కలుపుకుంటూ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది.. అందరూ సఖ్యతతో పనిచేయాలి.. సంయమనం పాటించండి.. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టండంతో పాటు వైసీపీ దుష్ప్రచారాలకు ప్రజలు ప్రభావితం కాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయండని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, పార్లమెంట్, నియోజకవర్గ ఇంచార్జులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu