Latest News
దేశంపై ట్రంప్ దాడి.. గ్రీన్ ల్యాండ్ ప్రధాని ఆందోళన
posted on: Jan 21, 2026 3:03PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక విధంగా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించి తీరుతామని ప్రకటించిన నేపథ్యంలో అందుకు గ్రీన్ ల్యాండ్ కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై గ్రీన్ ల్యాండ్ ప్రధాని తన ఆందోళనను వ్యక్తం చేయడమే కాకుండా.. ట్రంప్ దాడికి సిద్ధం కావాలని దేశ ప్రజలను సైతం అప్రమత్తం చేశారు. ఈ మేరకు మంగళవారం (జనవరి 20)న ఒక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ను స్వీధీనం చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో దేశ ప్రజలు అమెరికా సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రస్తుతానికి సైనిక దండయాత్ర అంత తేలిక కాదు కానీ ఆ అవకాశాన్నిపూర్తిగా తోసిపుచ్చలేమని గ్రీన్ లాండ్ ప్రధాని జెన్స్ ఫెడ్రిక్స్ నీల్సన్ అన్నారు. ట్రంప్ ప్రకటనలు, కార్యాచరణ నేపథ్యంలో గ్రీన్ ల్యాండ్ ప్రధాని ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సులభంగా గ్రీన్ ల్యాండ్ తన ఆధిపత్యాన్ని అంగీకరించకుంటే అమెరికాకు సైనిక చర్య వినా మరో మార్గం ఉందని హెచ్చరించడంతో సరిపెట్టకుండా ట్రంప్ డెన్మార్క్క్ వైపుగా సైనిక దళాలను మోహరించడం మొదలు పెట్టారు. అందుకు ప్రతిగా డెన్మార్ కూడా సైనిక దళాలను మోహరించింది.
ఈ నేపథ్యంలో అంటార్కటికా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఏ విధంగా చూసినా అమెరికా ఆధిపత్యం సుస్పష్టం. ఈ నేపథ్యంలో ట్రంప్ తలచుకుంటే సైనిక చర్య ద్వారా గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడం అసాధ్యం, అసంభవం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు అనుగుణంగానే గ్రీన్ ల్యాండ్ ప్రధాని ప్రకటన ఉండటంతో ఏ క్షణంలోనైనా గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి ట్రంప్ సైనిక చర్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.






