మేడారం వనదేవతలను దర్శించుకున్న గవర్నర్

posted on: Jan 30, 2026 2:20PM

 

మేడారం వన దేవతాలను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్శ దర్శించుకున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ పూజలు చేశారు. ఈ సందర్బంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గవర్నర్ రాకతో ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.  మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో భక్తులను అదుపు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. సమ్మక్క-సారలమ్మను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గారెత్ విన్ ఓపేవెన్ మొక్కులు చెల్లించుకుని తుల భారం వేశారు.

ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జాతరకు వీఐపీలు, వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 25 మంది ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...