ఫార్ములా ఈ రేస్.. కేటీఆర్ కు బిగ్ షాక్!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బిగ్ షాక్ తగిలింది. ఈయన ఏ1 నిందితుడుగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీకి తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే  ఈ కేసులో ఏ1 కేటీఆర్ ను ఏసీబీ నాలుగు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ ను ఐదుసార్లు విచారించింది.

ఈ కేసుకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ ,ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో  తొమ్మిది నెలల పాటు అన్ని కోణాల నుంచీ పకడ్బందీగా  విచారణ జరిపిన ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి  రెడీ అవుతోంది.  కాగా ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన ఎమ్మెల్యే కనుక గవర్నర్ అనుమతి అవసరం. దీంతో ఏసీబీ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ గత సెప్టెంబర్ 9న లేఖ రాసింది. 

అలా లేఖ రాసిన పది వారాల తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు  గవర్నర్ నుంచి అనుమతి లభించింది.  అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీవోపీటీ అనుమతి కోరిన ఏసీబీ.. ఆ అనుమతి కూడా రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, అలాగే బీఎల్ఎన్ రెడ్డిలపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu