బావ, బావమరుదులిద్దరిదీ విషాదాంతమే..

posted on: Jun 3, 2014 2:30PM

 

 

 

ఎంతో స్నేహంగా వుండే బావ, బామరుదులిద్దరూ రాజకీయంగా ఎంతో పైకి ఎదిగారు. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతలోనే విధి వారిని వక్రదృష్టితో చూసింది. ఇద్దరినీ అకాల మరణం పేరుతో కబళించింది. ఆ ఇద్దరు బావ, బావమరుదులు ఎవరో కాదు.. బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే. వీరిద్దరూ బావ బామరుదులు.

 

ప్రమోద్ మహాజన్ చెల్లెలు ప్రాండ్యాను పెళ్ళాడారు. ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే ఎంతో స్నేహంగా వుండేవారు. ప్రమోద్ మహాజన్ జాతీయ స్థాయిలో బీజేపీ నాయకుడిగా గొప్ప స్థాయిలో వెలుగొందుతున్న సమయంలోనే ఊహించని విధంగా మరణించారు. ప్రమోద్ మహాజన్‌ను ఆయన సోదరుడు, మతిస్థిమితం లేని ప్రవీణ్ మహాజన్ తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ సంఘటన దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో ప్రమోద్ మహాజన్ నేలరాలిపోయాడు.



అలాగే నరేంద్రమోడీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి పది రోజులు కూడా గడవకముందే గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించడం దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంలో దేశ ప్రజలు ప్రమోద్ మహాజన్‌ని, గోపీనాథ్ ముండేని గుర్తు చేసుకుంటున్నారు. పోల్చి చూస్తున్నారు. ఇద్దరూ మూడో తేదీన కన్నుమూయడ౦ విచిత్రం!  

google-ad-img
    Related Sigment News
    • Loading...