Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ రైతులకు కేంద్రం మరో వరం : బండి సంజయ్
posted on: Jul 22, 2026 5:13PM
.webp)
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక ఎక్స్ (X) వేదికగా తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన తాజా ఊరటపై స్పందించారు. "మోదీ హై తో ముమ్కిన్ హై" అంటూ తన పోస్టును ప్రారంభించిన ఆయన, తెలంగాణలో రబీ 2025–26 సీజన్‌కు వరి సేకరణ అంచనాను 35 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయాన్ని వెల్లడించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి మరింత పరిమాణంలో వరి కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుం దని, తద్వారా రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. రైతులు పండి చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసి, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు బండి సంజయ్ వెల్లడించారు.
అలాగే తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారాన్ని కూడా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక త్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోం దని, రైతుల శ్రేయస్సు కోసం అవసరమైన ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ వారి పక్షాన నిలుస్తోందని బండి సంజయ్ తన పోస్టులో పేర్కొన్నారు. తెలంగాణ రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.






