గ్రామ పంచాయతీలకు కేంద్రం గుడ్ న్యూస్

posted on: Feb 12, 2026 1:44PM

 

తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తొలివిడతలో రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. మరో రూ.387 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం రెండు విడతల్లో కలిపి రూ.646.46 కోట్లు రిలీజ్  చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. 

ఇంకా సుమారు రూ. 2,400 కోట్లు విడుదలు పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి, కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సమర్పించింది. ఇందుకు అనుగుణంగా విడతలవారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...