Latest News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కోటి రూపాయల బంగారం పట్టివేత

posted on: Mar 19, 2026 11:16AM

 

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు కోయంబత్తూర్ నుంచి వైజాగ్‌కు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుండి భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూర్ నుంచి బయలుదేరిన ఒక ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ సమయంలో విమానం మారాల్సి ఉంది. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడిని ఆపి... అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న భారీ మొత్తంలో బంగారం కనిపించింది. 

దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.1 కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుని అరెస్టు చేశారు.ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నాదా? బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరికి అందించాల్సి ఉంది? అనే కోణాల్లో అధికారులు కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఇలాంటి ఘటనలను అడ్డుకుంటు న్నారని అధికారులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...