Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బురఖా మాటున బంగారం స్మగ్లింగ్.. ముంబై ఎయిర్ పోర్టులో లేడీ స్మగ్లర్ల అరెస్టు
posted on: Apr 11, 2026 12:17PM
.webp)
ముంబైలో శనివారం (ఏప్రిల్ 11) తెల్లవారుజామున సినిమా ఫక్కీలో బంగారం స్మగ్లింగ్ కు ప్రయత్నించిన కెన్యా నుంచి వచ్చిన మహిళల బృందాన్ని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకు న్నారు. ఈ ఘటన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానా శ్రయంలో జరిగింది. ముందుగానే విశ్వసనీయ సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల్లా విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన డిఆర్ఐ బృందం తనిఖీలు కఠినతరం చేయడంతో ఆ మహిళల్లో కొందరు తమ బ్యాగులనే అక్కడే పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో విమానాశ్రయంలో దాదాపు రెండు గంటలపాటు హైడ్రామా సాగింది. అధికారులను ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ చివరకు డిఆర్ఐ బృందం వారిని అదుపులోకి తీసుకుంది.
24 మంది మహిళల వద్ద నుంచి మొత్తం 30 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.38 కోట్లుగా అంచనా వేశారు అధికారులు.ఈ కేసులో 24 మంది మహిళలను అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయంలో ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.






