ఆగని పసిడి పరుగు.. అదే దారిలో వెండి కూడా

posted on: Jan 28, 2026 11:55AM

బంగారం, వెండి ధరలు పెరుగుదల అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. తాజాగా బంగారం ధర పది గ్రాములకు రూ.3,220లు పెరిగింది. అలాగే వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్  రోజు రోజుకూ పెరిగుతోంది.

 బుధవారం (జనవరి 28న) ఉదయం 11:00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల   పది గ్రాముల బంగారం ధర 1,65,170కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 మేర పెరిగి రూ. 1,51,400కి చేరింది . ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,65,300కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,51,550కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు పది వేల రూపాయల మేర పెరిగింది.   దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3.8 లక్షలుగా ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...