Latest News

పసిడి ధరలకు రెక్కలు.. ఒక్కరోజే పదివేలు పెరిగిన బంగారం కాస్ట్

posted on: Mar 24, 2026 8:57AM

పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. యుద్ధ భయాలు,  అంతర్జాతీయ రాజకీయాలు పసిడి మార్కెట్‌ చిగురుటాకులా వణికించేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన తరువాత కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలక పోవడంతో బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా ఆకాశానికి ఎగిశాయి. సోమవారం (మార్చి 23) ఒక్కరోజే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి పతనమయ్యాయి. హమ్మయ్యా అనుకునేలోగానే మళ్లీ ధరలకు రెక్కలు వచ్చాయి.

ఈ పరిణామాలు ఇటు వినియోగదారులను, అటు ఇన్వెస్టర్లను కూడా తీవ్ర గందరగొళంలో పడేశాయి.  సోమవారం (మార్చి 23) ఉదయం యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చేపడంతో పసిడి ధరలు పతనమయ్యాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం 10   10 గ్రాముల బంగారం ధర రూ.1.36 లక్షలకు పడిపోయింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని అంతా భావించారు.   సాయంత్రానికి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించగానే  బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం రాత్రి  10 గ్రాముల బంగారం ధర తిరిగి రూ.1.46 లక్షలకు పెరిగింది.  గంటల వ్యవధిలోనే  పసిడి ధర ఏకంగా పదివేల రూపాయలు పెరిగింది. వెండి కూడా ఇదే దారిలో పయనించి కిలో రూ.2.32 లక్షల వద్ద స్థిరపడింది.

సాధారణంగా యుద్ధ భయాలు తగ్గితే ముడి చమురు ధరలు పడిపోతాయి, బంగారం ధరలు  స్థిరపడతాయి. ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు   పతనమైనా, బంగారం ధర మాత్రం పెరగడం విస్మయపరుస్తోంది. అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రధాన కారణం అనిశ్చితేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధ విరమణ తాత్కాలికమేననీ,  ద్రవ్యోల్బణ భయాలు ఇంకా కొనసాగుతున్నాయనీ  ఇన్వెస్టర్లు భావించడంతో బంగారం మాత్రమే సురక్షితమైన ఇన్వెస్ట్ మెంట్ అని భావిస్తున్నారు.  

వారి భయాలకు తగ్గట్టుగానే  ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన తరువాత కూడా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు ఇంకా తొలగిపోలేదనడానికి ఇదే తార్కానం. ఈ నేపథ్యంలో మంగళవారం (మార్చి 24) కూడా బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోను కావడం ధరలు పెరగడం ఖాయమని భావిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...