దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు

posted on: Mar 17, 2026 5:22PM

 

ఆకాశాన్నంటిన  పసిడి, వెండి ధరలు దిగివస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఫెడ్ (అమెరికన్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేటులో కోత ఉండదన్న అంచనాలు లోహాలకు డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం (17-3-26) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,410గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,44,290కు దిగొచ్చింది. వెండి ధర కూడా ఇదే బాటలో కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,76,000ల వద్ద ఊగిసిలాడుతోంది. విజయవాడలో కూడా పసిడి, వెండి ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. 

సోమవారం (16-3-26న) దేశంలో సగటున పసిడి ధర రూ.2,240 మేర పడిపోగా వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటులో కోత మరింత ఆలస్యం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయన్న భావన కూడా ప్రామాణిక వడ్డీ రేటు కోతపై ఆశలు తగ్గేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా డాలర్ బలపడి, బంగారం, వెండికి డిమాండ్‌ తాత్కాలికంగా తగ్గిందని చెబుతున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...