Latest News
బంగారం, వెండి ధరలు... పైపైకి
posted on: Jan 21, 2026 1:36PM

బంగారం, వెండి ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రూ.లక్షన్నర దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం (జనవరి 21) బంగారం ధర ఏకంగా తులం రూ.1.61 లక్షలు పలికింది. ఒక్కరోజులోనే బంగారం ధర అమాంతంగా తొమ్మిది వేల రూపాయలు పెరగడం గమనార్హం.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా బంగారంతో పోటీ పడుతోంది. ఒక్క రోజులో కిలో బంగారం ధర రూ.14 వేలు పెరిగి తాజాగా రూ.3.3 లక్షలకు చేరింది. గ్రీన్‌లాండ్ స్వాధీనానికి గాజా శాంతిమండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలు, ఫాన్స్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలు ప్రకటించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ద భయాలు పెచ్చరిల్లాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించడంతో వాటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెపుతున్నారు. మరో వైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకూ పెరుగుతుండటంతో దానికీ విపరీతంగా డిమాండ్ ఏర్పడిందంట.






