దిగివస్తున్న బంగారం, వెండి ధరలు
posted on: Feb 6, 2026 12:40PM
.webp)
ఏడాది క్రితం వరకూ లక్ష రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. వారం క్రితం బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,80,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. అయితే, ఊహించని విధంగా రెండు రోజులకే బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి.
రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 5) ) హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. పది గ్రాముల 24, 22,18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.2070, రూ. 1900, రూ.1560లు తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,39,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,260 వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోవైపు గత రెండు రోజుల నుంచి వెండి ధరలు కూడా పతనమౌతూ వస్తున్నాయి. తగ్గుతూ వస్తున్నాయి. గురువారం కిలో వెండి ధర రూ.3,00,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.30,000 దగ్గర ట్రేడ్ అయింది. ప్రస్తుతం కిలోపై రూ.20,000, 100 గ్రాములపై రూ.2000 మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,80,000 వద్ద, 100 గ్రాముల వెండి ధర రూ.28,000 వద్ద ట్రేడ్ అవుతోంది.






