Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోల్కొండ బోనాలకు తొలిసారిగా డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!
posted on: Jul 21, 2026 4:26PM

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయెల్ డేవిస్ పర్యవేక్షణలో ట్రాఫిక్ నిర్వహణ కొనసాగుతోంది. ఈసారి తొలిసారిగా డ్రోన్ సర్వైలెన్స్‌ను వినియోగిస్తూ గోల్కొండ కోట పరిసరాల్లో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు.
డ్రోన్ల సహాయంతో ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ముందుగా ప్రకటించిన ట్రాఫిక్ మళ్లింపులు సక్రమంగా అమలవుతున్నాయా అనే విషయాన్ని కూడా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ, అనధికార పార్కింగ్‌ను గుర్తించి అవసరమైన సూచనలు ఇస్తున్నారు.
ఖాళీగా ఉన్న పార్కింగ్ స్థలాలపై సమాచారాన్ని అందిస్తూ భక్తులకు మరింత సౌకర్యం కల్పిస్తున్నారు. గోల్కొండ కోటకు వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలు, భక్తులు అధిక సంఖ్యలో గుమికూడే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆటంకాలను వెంటనే గుర్తించి, క్షేత్రస్థాయి సిబ్బందితో తక్షణ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ సాంకేతికత వినియోగంతో ట్రాఫిక్ పరిస్థితులపై సమగ్ర అవగాహన లభిస్తోందని, బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు, సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సురక్షితంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Golconda Bonalu, Sri Jagadambika Ammavari Bonalu, Hyderabad Traffic Police, Drone Surveillance, Traffic Monitoring, V. C. Sajjanar, D. Joel Davis, Bonalu Festival, Smart Traffic Management, Hyderabad City


.webp)



