గోల్కొండ బోనాలకు పటిష్ట భద్రత.. బందోబస్తును పరిశీలించిన సీపీ సజ్జనార్..!

posted on: Jul 16, 2026 3:37PM

 

హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సందర్భంగా వేలాదిగా తరలివచ్చే భక్తుల భద్రత ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ స్వయంగా క్షేత్ర స్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోల్కొండ కోట దిగువ ప్రాంతం నుంచి ఆలయం వరకు ఏర్పాటు చేసిన బందోబస్తును నిశితంగా తనిఖీ చేశారు. అనంతరం జగదాంబికా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

 

ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సజ్జనార్.. తొలి బోనం రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఉత్సవాల భద్రత కోసం సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోటలోని ఆలయం వరకు ప్రత్యేక పోలీసు బలగాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

 

 

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆకతా యిలను అరికట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమె రాలు, విస్తృతమైన సీసీ టీవీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. జేబుదొంగతనాలు, గొలుసు చోరీలను నివారించేందుకు క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిరంతరం గస్తీ నిర్వహి స్తున్నాయని పేర్కొన్నారు. భక్తుల వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బోనాల ఉత్సవాలను ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ వెల్లడించారు.

Golconda Bonalu, Mahakali Ashada Bonalu, Langarhouse Square, CP VC Sajjanar, Minister Konda Surekha, Golconda Jagadambika Temple,Telangana Festivals
 

google-ad-img
    Related Sigment News
    • Loading...