Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు
posted on: Jun 16, 2026 4:45PM
.webp)
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది. గోవా కేంద్రంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన మాదకద్రవ్యాల ముఠాపై చేపట్టిన మెగా ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారులు అరెస్ట్ అయ్యారు. వీరిలో 14 మందికి నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ నెట్‌వర్క్ బెంగళూరు నుంచి కొకైన్, ఎండీఎంఏ పిల్స్, ఎల్‌ఎస్‌డీ వంటి మత్తు పదార్థాలను గోవాకు తరలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఒడిశా నుంచి హాష్ ఆయిల్‌ను తెప్పించి నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గోవాలోని వాగటర్ బీచ్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌ను లీజుకు తీసుకుని దాన్ని డ్రగ్స్ నిల్వ కేంద్రంగా మరియు పంపిణీ హబ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ప్రధాన నిందితుడు చక్రి హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమకు కొకైన్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. అతనితో పాటు హర్షిత్ రెడ్డి మరియు సుశీల్ కృష్ణ ఈ మొత్తం నెట్‌వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.
టెక్నికల్ విశ్లేషణ ఆధారంగా సుమారు 44 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించగా, వారిపై ఏకకాలంలో 15 ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 19 మంది వినియోగదారులు పట్టుబడ్డారు. డ్రగ్ పరీక్షల్లో 14 మందికి THC, METH ప్రభావం ఉన్నట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన వారిలో తన్నీరు వెంకట్రావు, గంటి భరత్, మురళీకృష్ణ సుశీల్, యశ్వంత్ సాయి, కొప్పుల నాగరాజు, కె. వంశీధర్ రెడ్డి, సిగుర్ల అరుణ్ కుమార్, గింజుపల్లి సందీప్, టి. సాత్విక్ రెడ్డి, కె. సందీప్ రెడ్డి, మ్యాకల ప్రవీణ్, చితమడక అభిలాష్, పడాల క్రాంతి సాగర్, పరిటాల రోహిత్ ఉన్నారు.
విచారణలో వీరంతా చక్రాపాణి, హర్షిత్ రెడ్డిల వద్ద నుంచే గంజాయి సహా ఇతర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా చక్రాపాణి ఖాతాకు రూ. 1,46,950, హర్షిత్ రెడ్డి ఖాతాకు రూ. 1,66,150 బదిలీ చేసినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.



.webp)


