Latest News

స్వర్ణ కుప్పం సాకారానికి భూములివ్వండి.. నారా భువనేశ్వరి

posted on: Mar 26, 2026 2:55PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆమె తరచుగా కుప్పంలో పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా నాలుగు రోజుల కుప్పం పర్యటన కోసం మంగళవారం (మార్చి 24) నియోజకవర్గానికి వచ్చారు.  తొలి మూడు రోజులూ ఆమె పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమయ్యారు. ముఖాముఖీలు నిర్వహించారు.

ప్రజా సమస్యలపై ఆరా తీశారు. వాటి పరిష్కారానికి తన వంతు సహాయం అందిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇక మూడో రోజైన గురువారం (మార్చి 26) ఆమె పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయం  ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శాంతిపురం లో అన్నా క్యాంటీన్‌ను భువనేశ్వరి ప్రారంభించచారు. ఆ తరువాత గుండిశెట్టిపల్లిలో ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబసభ్యులను పరామర్శించారు.

రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. అలాగే కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. బల్ల గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఆమె కుప్పం  చంద్రబాబు కలలుగంటున్న స్వర్ణ కుప్పం సాకారానికి అన్ని విధాలుగా సహకారం అందించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. చంద్రబాబుపై ఉన్ననమ్మకంతో కుప్పంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు క్యూకడుతున్నారన్న భువనేశ్వరి.. కుప్పంలో పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు.  పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములిచ్చి నియోజకవర్గ ప్రగతికి సహకరించాలని కోరారు. 

కుప్పం ప్రజలను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. "చంద్రబాబు మీద నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు పెద్దయెత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రగతికి అడ్డుపడకుండా పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములిచ్చి సహకరించాలి అని కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...