Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీఆర్ఎస్..సీమాంధ్రులపై ఈరోజు ఉన్న ప్రేమ రేపు ఉంటుందా..?
posted on: Jan 18, 2016 4:00PM

నిన్న రైట్ అనిపించింది ఈరోజు తప్పు అవ్వచ్చు.. ఈరోజు తప్పనిపించింది రేపు రైటవ్వచ్చు.. ఇదేదో సినిమాలో డైలాగ్ లా అనిపిస్తుంది కదా.. ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినైతే నిన్న మొన్నటి వరకూ తిట్టారో.. ఎవరి మీద కోపంతో ప్రత్యేకరాష్ట్రం కోరారో అలాంటి వారు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలపై విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నారు. దీనంతటికి కారణం గ్రేటర్ ఎన్నికలు.
గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీల సంగతేమే కాని టీఆర్ఎస్ పార్టీ మాత్రం సీమాంధ్ర ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకున్న కేటీఆర్ అయితే అందరి కంటే కొంచం ఎక్కువ ప్రేమనే కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లు ఉండగా అందులో 15 మంది సీమాంధ్రులకు టీఆర్ఎస్ టికెట్లు కేటాయించింది. తమ పార్టీ స్థాపించిన ఇన్నేళ్లో ఎప్పుడూ సీమాంధ్రులకు టికెట్లు ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు మాత్రం 15 టికెట్లును సీమాంధ్రులకు కేటాయించారు. అది కూడా సీమాంధ్రుల ఓట్లు ఎక్కువ ఉన్న డివిజన్లలో..తమకు వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన సమర్థులైన 15 మందిని ఎంపిక చేసి..కూకట్ పల్లి - అమీర్ పేట - సోమాజిగూడ - మియాపూర్ - జూబ్లీహిల్స్ - వెంగళరావు నగర్ - లాంటి సీమాంధ్రుల ప్రభావం ఉన్న డివిజన్లలో రంగలోకి దించడానికి రెడీ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ డివిజన్ల గెలుపు తమదే అని ధీమాగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసారిగా షాకయ్యేలా చేశారు. మరోవైపు అభ్యర్ధుల్ని పోటీలోకి దించినా.. గెలవాలి కదా అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు.
మరి ఇప్పుడైతే సీమాంధ్రుల మీద బానే ప్రేమ కురిపిస్తున్న అధికార పార్టీ తరువాత భవిష్యత్ లో కూడా ఇలానే ఉంటుందా..? హైదరాబాద్ లో ఉన్న వారంతా ఒక్కటే.. ఇక్కడున్నవారందరూ హైదరాబాదీయులే సెటిలర్లు కాదు అని.. ఆ మాటకొస్తే నేను కూడా సెటిలర్ నే.. నాది సిద్దిపేట అని మాటలు చెప్పిన కేటీఆర్ ఆ తరువాత కూడా అలాగే ఉంటారా.. ఇప్పుడు చూపిస్తుంది ఉత్తుత్తి ప్రేమ.. లేక నిజమైన ప్రేమనా..?ఇవన్నీ తెలియాలంటే ఇంకా చాలా రోజులు ఆగాల్సిందే.


.jpg)



